కీర్తనలు శ్యామా శాస్త్రి దయానిధే మామవ (వర్ణమ్‌)
బేగడ - ఆది
పల్లవి:
దయానిధే మామవ సదాశ్యామకృష్ణ పూజితే॥
అను పల్లవి:
భయాపహారిణి శ్రీ రాజరాజేశ్వరి॥
స్వరము(లు):
పాలితజన మునిగణ సుర సముదయే
లలిత పదయుగలే కమనీయ కంధరే
పాపశమని సుహృదయ సమ్మోదిత
మహనీయ సుగుణాలయే వితర భక్తిం మే॥
చరణము(లు):
పరమపావని భవాని పరాత్పరి శివశంకరి॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - dayAnidhE mAmava (varNam)