కీర్తనలు శ్యామా శాస్త్రి సామి నిన్నె నమ్మితిరారా రా ముద్దు కుమారా
బేగడ - ఆది
పల్లవి:
సామి నిన్నె నమ్మితిరారా రా ముద్దు కుమారా॥
అను పల్లవి:
నామీద దయ జూచి నన్ను రక్షింప రా వేగమే
తామసము జేసితే నిమిషమిక తాళజాలనయ్యా ముద్దయ్యా॥
చరణము(లు):
నీ మహిమలు బ్రహ్మాదులనించి నిర్ణయింప తరమౌనా
పామరు నేను పొగడ తరమా పతితపావన షడానన
నా మనవి వినరా అనయము నీనామమే జపమురా గంభీరా
భూమిలో నీసాటి దైవమెవడు నీవే మహానుభావ నన్నుబ్రోవు॥
తాపములనెల్ల ఇక బాపుదువని ప్రాపు కోరితిరా నేను
నీ పాదములే దిక్కు లోకములను నిఖిల సంతాపహరణ
పాపహరణ సమ్మోహన కలావిధృత శ్రీపతి పద విదిత వేదాంత
రూప కోటి మన్మథాంగజిత సరోజనేత్ర ధీర రణధీర॥
కోరియుంటి నీదు సన్నిధిని కోరిన వారికెల్ల దయతోను
కోరికలనిచ్చేది నీ బిరుదు గదా కుటిల తారక విదారక
సారస చరిత నీ దయరాదా శ్యామకృష్ణనుత వైద్యే
శు నీలకంఠ వాహన దీనావన సుహృదయ వాస దరహాస॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - sAmi ninne nammitirArA rA muddu kumArA