కీర్తనలు శ్యామా శాస్త్రి పాహి మాం శ్రీ రాజరాజేశ్వరి అంబ పాహి మాం
నాట - రూపకం
పల్లవి:
పాహి మాం శ్రీ రాజరాజేశ్వరి అంబ పాహి మాం
శ్రీ రాజరాజేశ్వరి శ్రీ రాజరాజేశ్వరి శ్రీ రాజరాజేశ్వరి॥
అను పల్లవి:
సింహాసనారూఢే దేవతే దృఢవ్రతే సింహాసనారూఢే ఏహి ఆనంద హృదయే॥
చరణము(లు):
కామితార్థ ఫలదాయికే అంబికే కాళికే
కామితార్థ ఫలదాయికే కామకోటి పీఠగతే॥
మానవ మునిగణ పాలినీ మానిని జనని భవాని
మానిత గుణశాలిని నిరంజని నిఖిలపాప శమని॥
సారసపదయుగళే స్వరజతి కల్పిత సంగీ
త రసికే నటప్రియే బాలే సురభి పుష్ప మాలే॥
శారదే సామగాన సమ్మోదితకరి శ్రీ
చక్ర రాజేశ్వరి సులయకరి శ్యామకృష్ణ సోదరి॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - pAhi mAM shrI rAjarAjEshvari aMba pAhi mAM