కీర్తనలు శ్యామా శాస్త్రి మరి వేరే గతి ఎవరమ్మా
ఆనందభైరవి - మిశ్ర చాపు
పల్లవి :
మరి వేరే గతి ఎవరమ్మా మహిలో నను బ్రోచుటకు॥
అను పల్లవి :
శరణాగతరక్షకి నీవే యని సదా నమ్మితి నమ్మితిని మీనాక్షి॥
చరణము(లు):
మధురాపురినిలయా వాణీ రమా సేవితపదకమలా
మధుకైటభ భంజనీ కాత్యాయనీ మరాళగమనా నిగమాంతవాసినీ॥
వరమిచ్చి శీఘ్రమే బ్రోవు శివా అంబా ఇది నీకు బరువా
నెఱదాతవు నీవు గదా శంకరీ సరోజభవాది సురేంద్రపూజితే॥
శుకశ్యామళ ఘనశ్యామకృష్ణుని సోదరీ కౌమారీ
అకళంక కలాధరి బింబాధరీ అపారకృపానిధి నీవే రక్షింప॥
స్వరము(లు):
పాదయుగము మదిలో దలచి కోరితి వినుము మదగజగమన
పరుల నుతింపగనే వరమొసగు సతతమునిను మది మరవకనే
మదనరిపుసతి నిను హృదయములో గతియని దలచి స్తుతి సలిపితే
ముదముతో ఫలమొసగుటకు ధరలో నతావన కుతుహల నీ వేగ॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - mari vErE gati evarammA