| కీర్తనలు | దాసు శ్రీరాములు | ఇద్దరి పొందేలరా - సామి దానింటికె పోపోరా |
| జంఝాటి - ఆది | |
| పల్లవి: | |
| ఇద్దరి పొందేలరా - సామి దానింటికె పోపోరా | ॥ఇద్దరి॥ |
| అనుపల్లవి: | |
| సద్దేల జేసేవు - సామి నే నోర్వ నా వద్దకు నీవు రా - వద్దుర వద్దుర | ॥ఇద్దరి॥ |
| చరణ: | |
| నా జోలి నీకేలరా ఆబ్రహ్మ - నిన్నెట్లు పుట్టించెరా ఏ జాము దానింట - నీజాడ నేజూడ బేజారు గాజాల - నేజెల్ల నేజెల్ల | ॥ఇద్దరి॥ |
| కన్నుల ఎరుపేమిరా చెక్కుల - కాటుక నలుపేమిరా కన్నుల విలుకాని - కయ్యాల మెలగిన చిన్నెలే తోచెరా - చెప్పరా చెప్పరా | ॥ఇద్దరి॥ |
| శ్రీపూర్ణ తోట్ల వల్లూరిపుర - వేణుగోపాల బాగాయె రాపేల దాసు శ్రీ - రామకవిపాల ఈ పట్ల నీపను - లింతాయె వింతాయె | ॥ఇద్దరి॥ |