| కీర్తనలు | దాసు శ్రీరాములు | ఏమనెనే కోమలీ - తెలుపవే నీతో |
| ఫరజు - ఆది | |
| పల్లవి: | |
| ఏమనెనే కోమలీ - తెలుపవే నీతో ఏమనెనే కోమలీ- తెలుపవే నీతో | ॥నేమనెనే॥ |
| చరణ: | |
| అంగజు బారికి - నిలువ దరమటే మంగళవార్తలు - మరియేమి నీతో | ॥నేమనెనే॥ |
| మోహ పయోధిలో - మునిగితినిక నే యూహలు సేయుదు - నొకసారి నీతో | ॥నేమనెనే॥ |
| దాసు శ్రీరామ - కవి గీతసుధా దాసుడైన హరి - దయచేసి నీతో | ॥నేమనెనే॥ |