| కీర్తనలు | దాసు శ్రీరాములు | కోపమా సామి యేమిర - కోపమా |
| కాఫి - చాపు | |
| పల్లవి: | |
| కోపమా సామి యేమిర - కోపమా | ॥కోపమా॥ |
| అనుపల్లవి: | |
| ఆపరాదుర మోహము పరి - తాప మందెర దేహము, నను రాపు జేయుట ద్రోహము నీ - రూపమైన జూపవేమిర | ॥కోపమా॥ |
| చరణ: | |
| వాదమా సామి నాతో - వాదమా లేదురా బలవంతము - ఇదికాదురా యొక పంతము, సడి రాదురా అత్యంతము నీ - మీది తమితో నేమి తోచదు | ॥కోపమా॥ |
| వీడరా మోడి నాపై - వీడరా ఆడుదానిరా దోసము కా - పాడరా పరిహాసము, నిను గూడని నావేసము మా - టాడనైన గూడదటరా | ॥కోపమా॥ |
| దోసమా సామి నాపై - దోసమా ... ... | ॥కోపమా॥ |