| కీర్తనలు | దాసు శ్రీరాములు | నను విడనాడుట - న్యాయమా సామి |
| హిందుస్థానీ భైరవి - ఆది | |
| పల్లవి: | |
| నను విడనాడుట - న్యాయమా సామి న్యాయమా సామి - న్యాయమా సామి | ॥నను॥ |
| చరణ: | |
| కనికర మేల లేదు - కారణ మేమిర కారణ మేమిర - కారణ మేమిర | ॥నను॥ |
| నను మరుబారి ద్రోయ - న్యాయమా సామి న్యాయమా సామి - న్యాయమా సామి | ॥నను॥ |
| విను తోట్లవల్లూరి - వేణుగోపాల వేణుగోపాలా - వేణుగోపాలా | ॥నను॥ |
| ఘన దాసు రామావన - కరుణింప వేమిరా కరుణింప వేమిరా - కరుణింప వేమిరా | ॥నను॥ |