| కీర్తనలు | దాసు శ్రీరాములు | నా నొసటనే పొడిచె - నా యేమిరా |
| ఖమాస్ - రూపకం | |
| పల్లవి: | |
| నా నొసటనే పొడిచె - నా యేమిరా | ॥నా నొసట॥ |
| అనుపల్లవి: | |
| నానా వర వర్ణినులకు - నావలె కామము లేదా | ॥నా నొసట॥ |
| చరణ: | |
| పరమ శివునౌదల గంగా - భామలేదా పరమేష్ఠి ముఖమున సర - స్వతి వసించలేదా | ॥నా నొసట॥ |
| దామోదరు రొమ్మున లే - దా ఇందిర కామాక్షి హరునర్ధాం - గమున బెనుగొనలేదా | ॥నా నొసట॥ |
| నా వేణుగోపాల - నన్నేలరాదా శ్రీవిలసిత శ్రీదాసు - శ్రీరామకవి వరదా | ॥నా నొసట॥ |