| కీర్తనలు | దాసు శ్రీరాములు | నిలునిలు మటుండుమీ - నాసామి |
| ఖమాస్ - ఆది | |
| పల్లవి: | |
| నిలునిలు మటుండుమీ - నాసామి నీవు నాదరి రాకుమీ - నాసామి | ॥నిలు॥ |
| చరణ: | |
| ఆ మాయలాడి - ఏమి బోధించెరా సామి నాకు దెల్పరా - సంశయమేమిరా | ॥నిలు॥ |
| సన్నుతాంగిని గూడి - నాసాటి వారిలో నన్ను రద్ది జేయుట - న్యాయము గాదుర | ॥నిలు॥ |
| వేసగాడవుగద - వేణుగోపాలసామి దాసుశ్రీరామకవిని - ధన్యుని జేయర | ॥నిలు॥ |