| కీర్తనలు | దాసు శ్రీరాములు | నీతోటి మాటలు - నాకేలరా సామి |
| కాఫి - ఆది | |
| పల్లవి: | |
| నీతోటి మాటలు - నాకేలరా సామి నాతోటి మాటలు - నీకేలరా | ॥నీతోటి॥ |
| అనుపల్లవి: | |
| నే తాళ దానితో - ఖాతాలు నీకేల ప్రీతిగల నాతియని - పోతివి రాతిరి | ॥నీతోటి॥ |
| చరణ: | |
| పరువటరా నాతో - పనులేమిరా సామి పరువటరా నాతో - పనులేమిరా విరజాజి బంతులు - విసరకురా సామి సరసము విరసమౌ - చాలుర చాలుర | ॥నీతోటి॥ |
| ఒయ్యార మిదియేమి - ఊరుకోరా సామి ఒయ్యార మిదియేమి - ఊరుకోరా ఉయ్యాల మంచము - నూచకురా సామి అయ్యది గయ్యాళి - అయ్యయో అయ్యయో | ॥నీతోటి॥ |
| వేసమా వల్లూరి - వేణుగోపాలా సామి వేసమా వల్లూరి - వేణుగోపాలా దాసు శ్రీరాముని - భాసుర వాక్యము చేసెరా వేయివేలు - సేబాసు సేబాసు | ॥నీతోటి॥ |