| కీర్తనలు | దాసు శ్రీరాములు | పోవోయి పోవోయి - పొలతులతో నింత |
| కాఫి - ఆట | ||
| పల్లవి: | ||
| పోవోయి పోవోయి - పొలతులతో నింత | - పోటాపోటీ లేమోయి ॥పోవోయి॥ | |
| అనుపల్లవి: | ||
| వావిని ఈవాడ - వనితలెల్ల నీకు వావారే వావారే - వదిన మరదళ్లైరి | ॥పోవోయి॥ | |
| చరణ: | ||
| తల తడిపి తగని బా - సలు జేసిన నమ్మ | - దగిన కాలము గాదురా చెలువుడ మన యూరి - వెలయాండ్రతో నీకు భళిభళి భళీభళి - బహరీ ఖాతాలాయె | ॥పోవోయి॥ |
| వేషభాషలు జూపి - విషము చక్కెర జేసి | - విడుతురోయి పురుషులు హాషామాషీ చెలి - యల సయ్యాటలు నీకు భేషు భేషు భేషు - విజయ బిరుదములాయె | ॥పోవోయి॥ |
| బహురూపధర తోట్ల - వల్లూరి వేణుగోపాలా | - యెంత జాణవు రహి మించు దాసు శ్రీ - రాముని పలుకులు అహ హాహా అహా అహా - అమృత బిందువులాయె | ॥పోవోయి॥ |