| కీర్తనలు | దాసు శ్రీరాములు | భామిని రాగదే - సామిని తేగదే |
| కాఫి - ఆది | ||
| పల్లవి: | ||
| భామిని రాగదే - సామిని తేగదే కాముని బారికి - తాళుదునే తాళుదునే | - తాళుదునే ఆ కాముని బారికి - తాళుదునే | ॥భామిని॥ |
| చరణ: | ||
| నిన్న మొన్న గూడిన చెలిపై - మోహము నిండారగ నన్ను మరచెను గదలే - మదవతీ తాళుదునే యెటు - తాళుదునే ఆ వెన్నెల కాకకు - తాళుదునే | ॥భామిని॥ | |
| చెల్లబోనా సాటి - చెలులలో చిన్నతనం - బాయెనే మొల్ల విరులమీద - మెల్లని యీ చల్లని గాలికి - తాళుదునే తాళుదునే నేనెటు - తాళుదునే ఈ చల్లని గాలికి - తాళుదునే | ॥భామిని॥ | |
| ప్రేమమీర దాసు - కులజుడౌ రామ కవీంద్రుని - బ్రోచెనే సామజ వరదుం - డలిగెనే ఆమని ఢాకకు - తాళుదునే | ॥భామిని॥ | |