| కీర్తనలు | దాసు శ్రీరాములు | మనసిచ్చి నాతో - మాటాడవేమిరా |
| బేహాగ్ - ఆది | |
| పల్లవి: | |
| మనసిచ్చి నాతో - మాటాడవేమిరా | ॥మనసిచ్చి॥ |
| చరణ: | |
| మనవి వినరాదా - మమతింత లేదా మునుపటి చెలిమికాదా - మోదముకాదా | ॥మనసిచ్చి॥ |
| విను నేను బాల - విడనాడ మేలా చనవుంచుమీ చాల - జాలమిదేలా | ॥మనసిచ్చి॥ |
| వర దాసుశ్రీరామా - వనసుగుణధామా శరణు నన్నేలు ప్రేమ - శ్యామాభిరామా | ॥మనసిచ్చి॥ |