| కీర్తనలు | దాసు శ్రీరాములు | వగకాడ తగదిక రారా |
| ఖమాస్ - ఆది | |
| పల్లవి: | |
| వగకాడ తగదిక రారా మగువ నేచుట - మంచిదటరా | ॥వగకాడ॥ |
| చరణ: | |
| కృపలేదా - సామి నామీద ఉపరతి సుఖమున - నోలలాడించెద | ॥వగకాడ॥ |
| వినవేర - వేణుగోపాలా మనసున నీకుగల - మర్మము దెలుపర | ॥వగకాడ॥ |
| పసిబాల - తాళజాలర రసిక దాసు శ్రీ - రాము నేలుకోరా | ॥వగకాడ॥ |