| కీర్తనలు | దాసు శ్రీరాములు | వద్దు వద్దుర ఇక - వదలరా సామి |
| ఫరజు - చాపు | |
| పల్లవి: | |
| వద్దు వద్దుర ఇక - వదలరా సామి పొద్దు పోయెరా నీ - పుణ్యము పోపోరా | ॥వద్దు॥ |
| చరణ: | |
| కోపగించకు మగని - కోత కోర్వను సామి రేపు వచ్చెద చాల - సేపాయె పోపోర | ॥వద్దు॥ |
| కంటగించకు నే - గానా నీదాన సామి యింటికి పోవలె - నిప్పుడే పోపోరా | ॥వద్దు॥ |
| వినుమ నా మనవి - వేణుగోపాలా ఘన దాసు శ్రీరామ - కవిపాల పోపోర | ॥వద్దు॥ |