| కీర్తనలు | దాసు శ్రీరాములు | సరిసరిలే మంచిది |
| కాఫి - ఆది | |
| పల్లవి: | |
| సరిసరిలే మంచిది మరుశరములకు బె - దరి దరి జేరినది | ॥సరి సరి॥ |
| అనుపల్లవి: | |
| అరమరిక లేమిరా - అరమరిక లేమిరా | ॥సరి సరి॥ |
| చరణ: | |
| పలుమరు నే నిను - బ్రతిమాలితి నని పాటింపరా వేణు - గోపాలా కలకాలంబును - ఘనమా ఇది | ॥సరి సరి॥ |
| మ్రొక్కగ వచ్చిన - మోడి సేతువురా మోహన రూపా - వేణుగోపాలా దక్కితిరా దాసు - శ్రీరామపాలా | ॥సరి సరి॥ |