| కీర్తనలు | దాసు శ్రీరాములు | అప్పటి మాటలకు - దుప్పటిచ్చె గాని |
| తోడి - త్రిపుట | |
| పల్లవి: | |
| అప్పటి మాటలకు - దుప్పటిచ్చె గాని అప్పటి గప్ప నిచ్చెనటే చెలి | ॥అప్పటి॥ |
| అనుపల్లవి: | |
| తప్ప నే నితరుల - దరి జేరనని యెన్నో చెప్పిన తలచు కొంటినే ఓ చెలి | ॥అప్పటి॥ |
| చరణ: | |
| తొలినాటి వగలే యా - మరునాటి పగలు మా చెలిమి కాకియు కో - వెల చందమాయెనే | ॥అప్పటి॥ |
| పడతి మగవారి బారు - పడకింట మితిమీరు గడప దాటిన వెనుక - కారు మన వారు బడిబడి నాడు వారు - బ్రతిమాలి పాదముల బడి వేడు కొన్నగాని - పలుకే మేల్మి బంగారు | ॥అప్పటి॥ |
| కాసు వీసము లిచ్చి - గోస గూసల మసి బూసి నేరేడు గాయ - జేసెనే చెలి వేసాలమారి మా - వేణుగోపాల మూర్తి దాసు శ్రీరామకవి - డాసి యేలుచుండెనే ఓ చెలి | ॥అప్పటి॥ |