| కీర్తనలు | దాసు శ్రీరాములు | కట్టివైతునా పడకింటిలో వాని |
| కాంభోజి - త్రిపుట | |||
| పల్లవి: | |||
| కట్టివైతునా పడకింటిలో వాని బట్టి పైట కొంగున | ॥కట్టి॥ | ||
| అనుపల్లవి: | |||
| ఇట్టివాడు వంట - ఇంటి కుందేలాయె ఎక్కడ బోయే ననుకో రాదమ్మ | ॥కట్టి॥ | ||
| చరణ: | |||
| విడచితినా సామి | - వీధివీధి తిరిగి | - వేగత్తెల గుడునే తడబాటులేక చే - తను జిక్కినప్పుడే చెడనీక పదిలము - చేసుకోవలెనమ్మ | ॥కట్టి॥ |
| ఏమరి నేనూరకుంటినా - ఈ రాత్రి | - ఏవేళ కేబుద్ధియో కోమలమున నింత - గోవగొన్నవాడు వామాక్షి మనవాడ నమ్మరాదమ్మా | ॥కట్టి॥ | |
| మోస పోతిని వేణు - గోపాల దేవుని | - బాస నిజము గాదే దాసు శ్రీరామదాసుని - హృదయము బాసి గడియయైన - నిలువ నొల్లడమ్మా | ॥కట్టి॥ | |