| కీర్తనలు | దాసు శ్రీరాములు | కామాంధకారము - కప్పెనా నీవింత |
| శంకరాభరణము - చాపు | ||
| పల్లవి: | ||
| కామాంధకారము - కప్పెనా నీవింత కనుగానక యుంటివి | ॥కామాంధ॥ | |
| అనుపల్లవి: | ||
| ఏమిరా తెలియదా - ఇది కాదని నీకు నీముద్దు కోమలి - నివసించిన యిల్లు | ॥కామాంధ॥ | |
| చరణ: | ||
| పంజరమున చిలుక - పగిది నేనుండగ | - పరులకు పనియేమిరా సంజ చీకటిదారి - జాడ తెలియలేక కంజాత నయన ఇ - క్కడ వచ్చితివా లేక | ॥కామాంధ॥ |
| వగకాడ నీవంటి - వానికి నావంటి | - మగువ పొందది ఏలరా మొగలి పూజిదుమ బో - ముల్లా కంటిన యట్లు తగని ఈ నా యిల్లు - దారి దాకెనా లేక | ॥కామాంధ॥ |
| భ్రమ లేల నిన్నటి - రాతిరి గలసిన | - భామ ఇల్లిది గాదురా రమణీయ దాసు శ్రీ - రామ కవీంద్రుని అమల చిత్తాంబుజ - మనుకొంటివా లేక | ॥కామాంధ॥ |