| కీర్తనలు | దాసు శ్రీరాములు | నేను నీదాన నా - మేను నీ దేనురా |
| శంకరాభరణము - ఆది | |
| పల్లవి: | |
| నేను నీదాన నా - మేను నీ దేనురా నీనా సందున - గానడెవాడురా | ॥నేను॥ |
| చరణ: | |
| ఎన్నడు నీమాట - కెదురాడనురా మన్నించి తిన్నగ - మాటాడ వేమిరా | ॥నేను॥ |
| ఓరీ నాసామి నే - కోరితిరా నిన్నే తీరైన గుబ్బల - గోరులుంచ రార | ॥నేను॥ |
| భాసుర వేణుగో - పాల దయాళవాల దాసు శ్రీరాముని - దయనేల వదేల | ॥నేను॥ |