| కీర్తనలు | దాసు శ్రీరాములు | నేనెరుగనా నీజాడ - నాసామి నేనెరుగనా |
| దర్బారు - జంపె | |
| పల్లవి: | |
| నేనెరుగనా నీజాడ - నాసామి నేనెరుగనా | ॥నే॥ |
| అనుపల్లవి: | |
| మాను నీ వగలెల్ల - మావద్దనా సామి | ॥నే॥ |
| చరణ: | |
| మరుపెన్నటికి రాని - మంచి మాటలె చెప్పి అరచేత వైకుంఠ మట్టెచూపి పరిపూర్ణ దయ గలిగి - పనులెల్ల కానిచ్చి సరసుడవు నీ వింద్ర జాలములు చేసేవు | ॥నే॥ |
| ముద్దు నాసామి నీ - మురిపంపు సుద్దులివి ముత్యాలు పదివేలు - మూటగట్టు బద్దులాడను పంచ - బాణుడాన నీవలపు మిద్దె పై నిడుపరుగు - మీసాలపై తేనె | ॥నే॥ |
| కనికరము పూజ్య మా - కాశ పుష్పము నిజము వినవోయి మగవారి - వింతలెల్ల ఘనదాసు శ్రీరామ - కవికీర్తనంబులే విన వేడుకాయె నీ - పని పదిల మాయెనిక | ॥నే॥ |