| కీర్తనలు | దాసు శ్రీరాములు | పగవారికి నవ్వగ సందే - మగడే నను వేరు జేసెగదే నా |
| కాఫి - మిశ్రచాపు | |
| పల్లవి: | |
| పగవారికి నవ్వగ సందే - మగడే నను వేరు జేసెగదే నా మగడే నను వేరు జేసెగదే | ॥పగవారికి॥ |
| చరణ: | |
| వినవే తనమో - మున ముద్దిడ బోయిన వద్దని దిగ్గున లేచెనయో ఎనసి ముద్దిడరాదటే ఇది వాదటే మనసులో దయలేదుగా - ముమ్మాటికి ఇక మాటలేమిటికి | ॥పగవారికి॥ |
| కలనా మరుకోలలనొ యెడ గు - బ్బల నాగగలనా లలనా వలచి చేరిన నేరమా - పెరవారమా చెలియ నాతో నలుక - లేటికి చెల్లబో నేనేటికి | ॥పగవారికి॥ |
| వర తోటల వల్లూరి వేణూగోపాలా - కరుణారసకలిత సుకలిత భరిత దాస్వభిరాముని - శ్రీరాముని సరస సమ్మత చరితుడాయెనే - సామిని నేమందునే | ॥పగవారికి॥ |