| కీర్తనలు | దాసు శ్రీరాములు | పోయి వచ్చెద సామీ - అత్తింటికి |
| బేగడ - ఆట | ||
| పల్లవి: | ||
| పోయి వచ్చెద సామీ - అత్తింటికి పోయి వచ్చెద సామీ | ॥పోయి॥ | |
| అనుపల్లవి: | ||
| హా యేమి సేతు న - న్యాయముగా మన నీయెడలను దైవ - మెడ బాపె నయ్యయో | ॥పోయి॥ | |
| చరణ: | ||
| మరచిపోక యుండుమీ - యెన్నటికి | - మనము చేసిన చెలిమి హరిహరి నిద్రాహారము లెరుగక దరి లేని విరహసా - గరమున నీదుచు | ॥పోయి॥ |
| బడిబడి నెంతో తమి - కోరకు మీ | - పడచుకత్తెల కూరిమి ఎడలేక కన్నీరు - విడువనేలర సామి తడవు లేదెట్లయిన - తప్పించి రాలేనా | ॥పోయి॥ |
| ఘన వేణు గోపాలా - దాసు శ్రీరామ | - కవిపాలా మృదుశీలా మనసు రాయి జేసు - కొని యెట్లు నిలుతు నా తనువునీదే సుమ్మి - దయయుంచు నామీద | ॥పోయి॥ |