| కీర్తనలు | దాసు శ్రీరాములు | మగువ నేనెంత - మంద బుద్ధి నైతి |
| తోడి - చాపు | |
| పల్లవి: | |
| మగువ నేనెంత - మంద బుద్ధి నైతి మగని తూలనాడితి - మోస పోయితి | ॥మగువ॥ |
| అనుపల్లవి: | |
| తెగువ తొల్లి యిల్లు - తిరిగి చూచుచున్న నగధర నినుజూచి - నగరా పొమ్మంటి | ॥మగువ॥ |
| చరణ: | |
| బెట్టు విడచి మ్రొక్కు - బెట్టు వచ్చిన నన్ను బట్టకురా నీ - బవిసి దెలిసె నంటి | ॥మగువ॥ |
| వాసిగా నాతోడ - యూసులాడెదనన్న దాసు శ్రీరామ కవి - డాసి ఏలుకొమ్మంటి | ॥మగువ॥ |