| కీర్తనలు | దాసు శ్రీరాములు | ముక్కు పచ్చలారని చిన్నదాన - న |
| యదుకుల కాంభోజి - త్రిపుట | ||
| పల్లవి: | ||
| ముక్కు పచ్చలారని చిన్నదాన - న న్నెక్కడి కంపెదరే - సిగ్గాయె న న్నెక్కడి కంపెదరే | ॥ముక్కు॥ | |
| అనుపల్లవి: | ||
| నిక్కము రేయెల్ల - నిదుర బోయెద నమ్మా తక్కిన పనులేమి - నేనెరుగనో యమ్మా | ॥ముక్కు॥ | |
| చరణ: | ||
| వంచిన నాచేయి | - మంచి గంధములోన ముంచి యెత్తెదరేలనే - సిగ్గాయె నన్నెక్కడి కంపెదరే మంచిదేరమ్మ - మగవారి చేయిబట్టు మంచు దెల్పెదరు నా - కలవాటు లేదమ్మా | ॥ముక్కు॥ |
| అందముగా సున్న - మాకీనె దీసి నే | - నంటరాయ నేరనే అందగాని నోటి - కందీయ మనియెద రిందరిలో మన సెట్టు - లొప్పునోయమ్మా | ॥ముక్కు॥ |
| ఈ పనులా పను - లేల చెప్పెదరు నే | - నేపని కోపలేనే ప్రాపై దాసుశ్రీ - రాము నేలిన వేణు గోపాల దేవుని - గూడి యుండెదనమ్మా | ॥ముక్కు॥ |