| కీర్తనలు | దాసు శ్రీరాములు | ముద్దుముద్దుగ పిలవనా - నా సామిని |
| అఠాణ - చాపు | |
| పల్లవి: | |
| ముద్దుముద్దుగ పిలవనా - నా సామిని ముదుగు ముదుగుగ పిలువనా - నా సామిని | ॥ముద్దు॥ |
| అనుపల్లవి: | |
| ముద్దు ముద్దుగ పిలువ - చులక సేయునేమో ముదుగు ముదుగున పిలువ - బాగని తోచేనే | ॥ముద్దు॥ |
| చరణ: | |
| పాటలు పాడుదునా - మంచి ఆటలు ఆడుదునా వాటమైన గుబ్బ - పోటు జూపింతునా గోటి కొన చెక్కిలి - మీటుదునా | ॥ముద్దు॥ |
| ఆకు మడుపు లిత్తునా - మంచి తావి అత్తరు పై బూతునా తేకువతో జడ - త్రిప్పి కొట్టుదునా మోకమోవి చిగురు - మోవి గరతునా | ॥ముద్దు॥ |
| కోపగించకు మందునా - యేర వేణు గోపాల రమ్మందునా శ్రీపూర్ణమగు దాసు - శ్రీరాము మనమున ప్రాపై నివసించి - పాలించమందునా | ॥ముద్దు॥ |