| కీర్తనలు | దాసు శ్రీరాములు | వట్టు బెట్టెద నాచై - పట్టరాకురా సామి |
| ఆనందభైరవి - చాపు | |
| పల్లవి: | |
| వట్టు బెట్టెద నాచై - పట్టరాకురా సామి | ॥వట్టు॥ |
| అనుపల్లవి: | |
| గట్టిగ పదివేల - కరకు వరాల మూట గట్టి నా కట్టెదుట - బెట్టి మాటాడర | ॥వట్టు॥ |
| చరణ: | |
| గారాన నొక యమ్మ - కని పెంచిన బిడ్డ యూరకే వచ్చునా - తేరా సరిగ చీర | ॥వట్టు॥ |
| వలచి వచ్చినవారు - విలువ బెట్టకపోరు అలరింతు తేరా మంచి - ఆణి ముత్యాల పేరు | ॥వట్టు॥ |
| భాసుర వేణుగో - పాల జేజేల మిన్న దాసు శ్రీరామకవి - డాసి ఏలక యున్న | ॥వట్టు॥ |