| కీర్తనలు | దాసు శ్రీరాములు | వాడా నిను బంపునవాడా - నను బిల్వ |
| యదుకుల కాంభోజి - త్రిపుట | |
| పల్లవి: | |
| వాడా నిను బంపునవాడా - నను బిల్వ వనిత నే రాననవే - పోపోవే | ॥వాడా॥ |
| చరణ: | |
| చింతలేల వాడు - చీటీ బంపెనా సంతోషమే యనవే - పోపోవే | ॥వాడా॥ |
| చిన్ననాటి నుండి - చేసిన తన తోడి చెలిమి చాలు ననవే - పోపోవే | ॥వాడా॥ |
| కోపమేటికి తోట్ల - వల్లూరి శ్రీవేణు గోపాలా దగుననవే - పోపోవే | ॥వాడా॥ |
| వేయేల దాసు శ్రీ - రామ హృదయవాసి వై యుండుమీ యనవే - పోపోవే | ॥వాడా॥ |