| కీర్తనలు | దాసు శ్రీరాములు | వారి వీరి జోలి - నాకేలరా సామి |
| ద్విజావంతి - మిశ్రచాపు | ||
| పల్లవి: | ||
| వారి వీరి జోలి - నాకేలరా సామి వద్దు వద్దు చాలురా | ॥వారి॥ | |
| అనుపల్లవి: | ||
| నోరు మూసుకొని - యూరకున్న గాని తీరదాయె దాని - పోరు నేనేమి సేతు | ॥వారి॥ | |
| చరణ: | ||
| అల దానితో నీవు - కలసి కులుకుచున్న | - నదె నాకు పదివేలురా వలపు నాపై నీకు - కలుగ కున్న నేమి తొలి నోము ఫలమని - తలచితినే కాని | ॥వారి॥ |
| వలవల కన్నీరు - వరదలై పారగా | - తల వ్రాసెగా దైవము నిలచి నీతో నింక - పలుకు లేమిటికిరా అలరు తేనియ విస - మైన గ్రోలెద గాని | ॥వారి॥ |
| వారక శ్రీతోట్ల - వల్లూరి వేణుగో | - పాలా మ్రొక్కెద మ్రొక్కెద ధీరుడైన దాసు - శ్రీరామ కవి కృతి సారమైన విని - సామి నన్నేలరా | ॥వారి॥ |