| శంకరాభరణము(ఆనందభైరవి) - త్రిపుట |
| పల్లవి: | నారాయణాయ నమో మాధవాయ॥ |
| అనుపల్లవి: | నాగేంద్రశయనాయ | నందితాఖిలలోకాయ॥ |
| చరణ (1): | నాభికమలజనితవిధిముఖాయ-నూతనజలధరాభాయ |
| | నానాచరాచరనారీనరరూపాయ |
| | నారదాదిమునివర్యవందితఘనమాయాయ॥ |
| చరణ (2): | అగణితగుణగణాయ ఆగమగేయాయ-విగళితభయశోకాయ |
| | గగననిర్మలబోధగంభీరభావాయ |
| | భగవద్భక్తహృదయపద్మభానురూపాయ॥ |
| చరణ (3): | కరధృతరథచరణకంబుపంకజ-కౌమోదకీశార్ఙ్గాయ |
| | నిరవద్యగళశోభినిజకౌస్తుభభూషాయ |
| | పరిహృతపరపక్ష పక్షిరాజవాహాయ॥ |
| చరణ (4): | జగదేకనాథాయ జాతమదనాయ-జితవైరిమండలాయ |
| | నిగమనిశ్శ్వాసాయ నిత్యానందరూపాయ |
| | నిరుపమగోకులనీతనవనీతాయ॥ |
| చరణ (5): | ఆమయాదివిరహితాయాఖిలమాయాయ-కామకోటిసుందరాయ |
| | నామరూపరహితాయ భూమస్వరూపాయ |
| | సోమసూర్యనయనాయ సామగానగేయాయ॥ |
| చరణ (6): | వారిజలోచనాయ వాసుదేవాయ-వరమునిపారిజాతాయ |
| | కరుణాకర భక్తకారుణ్యసారాయ |
| | నారాయణతీర్థనత చరణాబ్జాయ॥ |