| మోహన(రేగుప్తి) - ఆట |
| పల్లవి: | బాలగోపాల మా ముద్ధర - కృష్ణ | పరమకల్యాణ గుణాకర॥ |
| అనుపల్లవి: | నీరదనీలకళేబర కృష్ణ | నిరుపమకౌస్తుభ కంధర॥ |
| చరణ (1): | నందనందన భక్త చందన సుర | బృందరచితబహువందన |
| | మందస్మిత సుందరానన కోటి | మదనసుందర జగన్మోహన |
| | ఇందిరామందిర భక్త | సుందరహృదయారవింద |
| | భృంగ భక్తిమకరంద | నందితగోపికాబృంద |
| చరణ (2): | తాంతాహతధైదత్తత్తాం - |
| | తక్కతో ధిమ్మిణాంగిణతో ధిమ్మిరే - |
| | తక్కతోధిమ్మిధిమికిటతోధిమ్మిరే - |
| | తక్కతోదిగిణాంగంగిణత్తోంగ |
| | ధిర్గుడుదధిగుడుధత్తోంగ - |
| | తోధిగిణంగత్తిరుత్తోంగ - |
| | దధిర్గుడుదధికితకిటదధిగిణతోం ॥ |
| చరణ (3): | యజ్ఞాదికర్మఫలప్రద కృష్ణ | యదుకులజాతసుఖప్రద |
| | యజ్ఞసంరక్షణదీక్షిత కృష్ణ | యతిజనముక్తిదసువ్రత |
| చరణ (4): | తాధైయ్యధైయత్తతా - |
| | కిటతకతత్కిణ్ణం - |
| | తరికిటతరికిట ధిమిధింధింధిమికిట - |
| | తోంగిటకిట త్తోంగతాంగిణ - |
| | కిణకిణ ధరిధరి కుం తకతక - |
| | ధిర్గుడుతక తక ధిర్గుడుతక |
| | గణపతిగురుశ్రీపతిషణ్ముఖ - |
| | జయజయజయ - |
| | ఝంతరికిటతక తత్తోంగిట తోంగిత్తకగిణ - |
| | దినహత ధిమితాతాధాం - |
| | తకధిర్గుడుతక దధిగిణతోం - |
| | దినహత ధిమితాతాధాం - |
| | తకధిర్గుడుతక దధిగిణతోం॥ |
| చరణ (5): | చింతితజనచింతామణిగణ | సంతతసుఖసంతానప్రద |
| | మందరధరమంజుళమౌక్తిక | నందితజన నందాత్మజ వర |
| | బృందావనబృందారకగణ | వందితపద వసుదేవాత్మజ |
| చరణ (6): | జయజయజయ - |
| | ఝంతరికిటతక తత్తోంగిట తోంగిత్తకగిణ - |
| | దినహత ధిమితాతాధాం- |
| | తకధిర్గుడుతక దధిగిణతోం ॥ |
| చరణ (7): | అన్నమయాదిషు పంచసు త్వా | మంతర మానందవిగ్రహం |
| | ఉన్నతఫల మామనంతి తే జగ | దుదయనయాదిషు లక్షితం |
| | తద్ధిత్వమేవాసి తద్ధిత్వమేవాసి | తత్సర్వమేతత్త్వమేవాసి నూనం |
| చరణ (8): | తదుత్తుంగముక్తామణి ప్రస్ఫురద్దివ్య - |
| | మత్తేభ వద్యోగిచిత్తేస్ఫురంతం |
| | నృత్యంత మత్యంత మానందమీడే - |
| | హితం త్వామహం త్వామహం త్వామహం |
| చరణ (9): | తధిత కుకుద కుకుత తత్తకుకుధికురు - |
| | తత్తత్తోంగు తక్కిటకిట కుధరి కిటతతోంగ - |
| | కిట్టకితకిట దధిగిణతోం ॥ | బాలగో |
| చరణ (10): | సతత మంత రవస్థితం | హృది సత్యవిజ్ఞానసుఖాకృతిం |
| | అంతర్యామి తయోదితం | యోగిచింతిత మాకలయామి |
| చరణ (11): | తత్తధిర్గుడుధత్తాం - తత్తధిర్గుడుధత్తాం - |
| | కిటతంతత్తరికి తత్తరికి దోగుడు దోగుడు తకధోంధోం - |
| | కుందకిటకిట ధరికుకుందత్తకుకుంధరికి |
| చరణ (12): | డేకుడేకు కుంధరికి డిక్కప్రభేదమిహ - |
| | ఝేకుఝేకు ఝుణజయశీలనటనం |
| చరణ (13): | సకలజగదాదిం సకలమునిగీతం |
| | సకలనిగమాంత జనితాంతమతివిదితం |
| | తం పరమయోగిగణ చింతితమఖండసుఖ |
| | సంపద మపారమహిమాన మణిమాన మిహ |
| | రంగత్తురంగ మాతంగ వరహంసగతి |
| | మంజీరమంజురటనట మఖిలరంజనం |
| చరణ (14): | తద్ధింత తద్ధింత తకిటధిమి ధిమిధిమి తధీం |
| | తకిటధిమి తకిటధిమి తకిటహం తధీం - |
| | తాహత్తధీం తాహత్తధిన్నాం - తాహత్తధీం - |
| | ధిన్నాధిన్నాహ త్తతాం ధిన్నాధిన్నధీం - |
| | తాతాధిన్నధీం తద్ధిన్న తకధిన్న తాహత్తధిన్నాం - |
| చరణ (15): | కత్తరిడి కత్తరిడి కాహురె కాహురె- |
| | కంజరిడి కంజరిడి దేహురే దాహురే |
| చరణ (16): | సంగీతసాహిత్య విద్యావినోదవరగోవింద గోపాల |
| | గోపీమనోహరే - మతిరస్తు రతిరస్తు - మంగళం భవతు మమ |
| చరణ (17): | తద్ధింత తద్ధింత తకిటధిమి ధిమిధిమి తధీం |
| | తకిటధిమి తకిటకిడ్ తకత్తకిట దధిగిణతోం ॥ | బాలగో |
| చరణ (18): | తారకసమముక్తహారకం భక్త | కారుణ్యరసపూరధారకం |
| | నారదమునిక్షేమకారకం | ధీరనారాయణతీర్థతారకం |
| చరణ (19): | తాం తాహతధణతాంధణాంధణతాం-దణ్ణాందణ్ణతాం |
| చరణ (20): | తద్ధిమ్మి తద్ధిమ్మి తాండవాలోలం - రింఝి రింఝి రింఘణ రాధాలోలం |
| | కుందకిటకిట ధరికి గోపికాజారం - నగధరం తోధిత్త నవనీతచోరం |
| చరణ (21): | త్వామహం కలయామి ధీర - మనామయం సకలకామదం భువి |
| | సంతత మానందతాండవాలోలం - సద్గుణమణిగణ భూషణజాలం |
| | సుందరగోకుల బాలగోపాలం - సత్యప్రతిజ్ఞ సంతానగోపాలం |
| | విఖ్యాతసత్కీర్తి విజయగోపాలం - మందస్మితానంద మదనగోపాలం |
| | కందర్పకోటి కల్యాణగోపాలం - భక్తజనబృంద ప్రసన్నగోపాలం |
| | సిద్ధజనసిద్ధాంత సిద్ధగోపాలం - మత్స్యావతారాది మహిమగోపాలం |
| | తం త్వామహం త్వామహం |
| చరణ (22): | తద్ధితకుకుధి కుకుత్తత్త కుకుధి కుకుతత్త - |
| | తోంగు తక్కిటకిట కిధరికిట తధోంగ - |
| | కిడ్తకిట తకిట దధిగిణతోం ॥ | బాలగో |
| చరణ (23): | ధైధరికిట తాహం దిత్తా - |
| | జేజేఝంతరి ధిధిధిగి దిత్తా - |
| | దిత్తరి దిగిదిర్గుడు దిగిదిర్గుడు దిత్తా - |
| | తదిమి తోదిమి తోంగిట దిత్తా |
| | తత్తోం తత్తోంగ క్కిటతక్కిట - ధణధణ తదిమహిణ్ణం - |
| | ధళంగు తకతక దధిగిణతోం। |
| చరణ (24): | స్వామినం విచిత్రవనమాలినం - పతత్రి రాజగామినం |
| | పరిపాలిత గోధనం - భుజగపతిశాయినం - సదానందదాయినం |
| | సమస్తవేదసాధనం - సనాతనం - బాలగోపాలకం - భజామి। |
| చరణ (25): | రేహురేహురే రింఖణ రింఖణ - |
| | కాహుకాహురే కంజరి కంజరి - |
| | ఝేకుఝేకురే ఝణత జ్జగగిణ - |
| | ఢేకుఢేకురే ఢింకుకు ఢింకుకు - |
| | ఝరుంఝరి హరిటకుము రింఖణ |
| చరణ (26): | తక్కిట కిటతక దిక్కిట కిటతక - |
| | తొంగిట కిటతక నంగిట కిటతక - |
| | తహత తహత దిమిత - |
| | ధణేకు దధిగిణతోం ॥ | బాలగో |