కీర్తనలు స్వాతి తిరుణాళ్‌ నవరాత్రి కీర్తనం 8 (ఎనిమిదవ రోజు) - పాహి జనని సన్తతం మామిహామలపరిణత
నాట్టకురఞ్జి - చాపు
పల్లవి:
పాహి జనని సన్తతం మామిహామలపరిణత-
విధువదనే
అనుపల్లవి:
దేవి సకలశుభదే హిమాచలకన్యే
సాహసికదారుణ చణ్డముణ్డనాశిని
చరణము(లు):
బాలసోమధారిణీ పరమకృపావతి
నీలవారిద నిభనేత్రే రుచిరశీలే
ఫాలలసిత వరపాటీరతిలకే శ్రీ-
నీలకణ్ఠదయితే నిగమవనమాతఙ్గి ॥1॥
సురభికుసుమ రాజిశోభిత కచబృన్దే
వరదే వాసవముఖ వన్ద్యమానచరణే
అరుణజపా కుసుమాధరే కౌముది-
పరమోజ్జ్వలహసితే భక్తకల్పలతికే ॥2॥
కమనీయతమరూపే కన్యాకుబ్జవాసిని
శమితపాపనికరే శాన్తహృదయగేహే
అమితవిమలరుచిహారే నీల
వారిదోపమవేణి శ్రీపద్మనాభసోదరి ॥3॥
AndhraBharati AMdhra bhArati - svAti tiruNAL kIrtanalu - navarAtri kIrtanaM 8 (enimidava rOju) - pAhi janani santataM mAmihAmalapariNata ( telugu andhra )