| కీర్తనలు | తూము నరసింహదాసు | శరణు భద్రశైల నాయకా - కావు కావు |
| యదుకులకాంభోజి - ఆది |
| పల్లవి: |
| శరణు భద్రశైల నాయకా - కావు కావు శరధిగర్వదళన సాయకా |
| చరణము(లు): |
| కరుగదాయె నేమొ హృదయము నన్నుఁ బ్రోవ గరుణ రా దిదేమి పాపము |
| పలుక వేమి సేయువాఁడను అన్నిటికినిఁ బ్రాపు నీ వని యున్నవాఁడను |
| పామరులను జేర నంటిని నేడు నీ పాదయుగముఁ జూపు మంటినీ |
| ఘోర సంసారవార్ధిని మునుగ లేక కోరి మిమ్ము గొల్తు నంటిని |
| నారసింహదాస పోషక భక్త హృదయ నలినమిత్ర శత్రుదూషక |