| కీర్తనలు | తూము నరసింహదాసు | వినవే శ్రీరాముని కథలు - నోట |
| శహన - ఆది / సౌరాష్ట్ర - ఆది (ఆట) |
| పల్లవి: |
| వినవే శ్రీరాముని కథలు - నోట ననవే - శ్రీరాముని కథలు |
| అనుపల్లవి: |
| వినవే రాముని కథ - వీనుల నిండను మనుజాధముల వేడు - మాట లుడిగి నేడు |
| చరణము(లు): |
| అనిశము పొట్టకై యార్తితోడ నీవు పనిబూని తిరిగిన - ఫలమేమి గంటివే |
| విషయాదులను గూడి - విఱ్ఱవీగుచు నీవు విష మమృత మని గ్రోలి - వెఱ్ఱివై తెలియక |
| పనిలేనిచోటను పనులు కల్పనచేసి శునకమువలె తిరిగి - చొప్పెరుగవైతివి |
| వాసిగ భద్రగిరీశుని దాసాను దాసులతో గూడి - తలపు లుడిగి నీవు |
| సురుచిరముగ తూము నరసింహదాసుని వెఱపింపఁ బోక వివేకముతో నీవు |