కీర్తనలు తూము నరసింహదాసు రామనామామృతమే నీకు - రక్షకం బనుకోవె మనసా

    
గానం: శ్రీ ఆకొండి శ్రీనివాస రాజారావు, కాకినాడ.

కీరవాణి - ఆది / మధ్యమావతి - ఆట
పల్లవి:
రామనామామృతమే నీకు - రక్షకం బనుకోవె మనసా
కామక్రోధ లోభాదులను - ఖండించు నీనామమహిమ
చరణము(లు):
తల్లి తండ్రి యెవరు నీవు - తర్లిపోవువేళ రారు
యెల్ల బాంధవులు చుట్టాలు - యేమిగతి కల్పింపలేరు
ధనమదెంత కలిగియున్న - తనతోడుత తగిలిరాదు
తనయు లెంద రున్నఁగాని - తనవిధిఁ దప్పింపలేరు
నేరిచి నేరక సేయు - నిత్యకృత్యవిధులు నేడు
సారసాక్షున కర్పించి - నారసింహదాసునిఁగూడి
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - raamanaamaamR^itamee niiku - raxakaM banukoove manasaa - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )