| కీర్తనలు | తూము నరసింహదాసు | పుట్టఁగానే సెలవా - యీ భువిలోన - |
| భైరవి - త్రిపుట |
| పల్లవి: |
| పుట్టఁగానే సెలవా - యీ భువిలోన - బుట్టఁగానే సెలవా |
| చరణము(లు): |
| పుట్టు చావు లేని గుట్టుఁ దెలిసి హరిని గట్టిగా మదిలోనఁ - గట్టి వేయనివాఁడు |
| మూటి నణచి వేగ - మూటి మూటినిఁ దెలిసి మూటి నేకముఁజేసి - మూల మెఱుగనివాఁడు |
| భేదములకుఁ బాదైన కామములను శోధించి తెగద్రుంచి - శుభము లందనివాఁడు |
| పరగ శ్రీహరికథఁ బాడకయాడక ముఱియుచుఁ దిరిగెడు - మూర్ఖపు జన్మము |
| చాల జాలకము సం - సారమే స్థిరమని దాలిమి భద్రాద్రి ధాముఁ గొల్వనివాఁడు |
| గారవమున - తూము నారసింహదాసు తారకనామముఁ - దలచుచుండనివాఁడు |