కీర్తనలు తూము నరసింహదాసు సీతామనోహర పాహి మాం రామ -

    
గానం: శ్రీ ఆకొండి శ్రీనివాస రాజారావు, కాకినాడ.

నాట - ఆది (జంఝాటి)
పల్లవి:
సీతామనోహర పాహి మాం రామ -
సీతామనోహర పాహి మాం
చరణము(లు):
సీతామనోహర
వాతాత్మజాధిప
సీతాబ్జలోచన సింధు గంభీరా
కుండలిశయన వే -
దండగమన కో -
దండధరణ మార్తాండ ప్రవీణ
రుద్రాది ముఖ్యదేవ -
భద్రాద్రివినుత శ్రీ-
భద్రాచలవిహార - భక్తమందార శౌరి
వైకుంఠ వాసుదేవ -
వామన శ్రీధర - వనరుహనాభ
మునివందిత పాదయుగళ
భాసిత నారసింహ -
దాసమనోబ్జ వి -
కాసాదరహసిత - హాసా చిద్విలాసా
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - siitaamanoohara paahi maaM raama - - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )