| కీర్తనలు | తూము నరసింహదాసు | రామసహాయ మెన్నటికో - భక్త |
గానం: శ్రీ ఆకొండి శ్రీనివాస రాజారావు, కాకినాడ.
| వరాళి - రూపక (ఆట) |
| పల్లవి: |
| రామసహాయ మెన్నటికో - భక్త - కామునిదయ నాపై గలుగు టెన్నటికో |
| చరణము(లు): |
| శాంతము గలుగుటెన్నటికో - దుష్ట - చింతలన్నియు బాయఁజేయు టెన్నటికో |
| హితమతి నుంచు టెన్నటికో - భక్త - తతిఁగూడివసియించు తరుణ మెన్నటికో |
| పోషింపగలుగు టెన్నటికో - నన్నూ - దూషించు వైరుల ద్రుంచు టెన్నటికో |
| కష్టము దీర్చుటెన్నటికో - నా - యిష్టదైవము నీవై యేలు టెన్నటికో |
| నీసేవ గలుగు టెన్నటికో - భద్రా - ద్రీశుని ధ్యానము చేయు టెన్నటికో |
| ఆనంద భరిత మెన్నటికో - తూము - నరసింహదాసునిఁ బ్రోచు టెన్నటికో |