| కీర్తనలు | తూము నరసింహదాసు | రామనామమే జీవనము - భక్తావనము పతితపావనము |
గానం: శ్రీ ఆకొండి శ్రీనివాస రాజారావు, కాకినాడ.
| కమాసు - ఆది / కాంభోజి - ఆట |
| పల్లవి: |
| రామనామమే జీవనము - భక్తావనము పతితపావనము |
| చరణము(లు): |
| హరిదాసుల జతగూడుదము వారి ననుదినమును గొనియాడుదము రఘువరుని సత్కథలెల్ల బాడుదము - శ్రీధరుని గొల్వనివారి వీడుదము |
| రాముడె దొరయని పల్కుదము - యితర రాజసేవకుల యలుకుదము భక్తి ప్రేమ జనులమీద జిలుకుదము - భువి పామరులను జూచి యళుకుదము |
| ఘట మస్థిరమని చాటుదము - యమ భటుల దూరముననె మాటుదము యీ చటుల సంసారాబ్ధి దాటుదము - యొక్క చిటికెనె యఘముల మీటుదము |
| శేషశాయిగని మ్రొక్కుదము - రఘు వీరు కథలు విని సొక్కుదము దుర్విషయాదుల దెగచెక్కుదము - మరి విబుధాహితుల పొందుఁ దక్కుదము |
| సిరి సంపదలు విడజిమ్ముదము - నరసింహావనుని నెద నమ్ముదము భద్రగిరి నాథునకు దేహ మమ్ముదము - అనితర యోగమున నుంట నమ్ముదము |