| కీర్తనలు | తూము నరసింహదాసు | రక్షకుఁడౌ నీవు గలిగియుండఁగ మాకు - రామరామ భయ మేలనే |
| అసావేరి - ఆట |
| పల్లవి: |
| రక్షకుఁడౌ నీవు గలిగియుండఁగ మాకు - రామరామ భయ మేలనే పక్షివాహన జగద్రక్షక నే నీ కటాక్షమే గోరితి మోక్షదాయక రామ |
| చరణము(లు): |
| అరిషడ్వర్గములచే నదరి బెదరి పరుల - నాశ్రయించఁగ మాకేలను మరుగులేని రామమంత్ర మనే పం - జరము గలుగఁ జేసి జడియకు మని బ్రోచె |
| చెలగి యీ సంసార చక్రమునను దగిలి - సొలసి వేసార మాకేలను అలసులైనవారి నన్యాయముగఁ జేరి కలవరమంద మాకేలను |
| మేర లేని సంసారవారిధిలోనఁ - జేరి మునుగ మాకేలను కోరి భద్రశైల కూటవాసుని జేరి నారసింహదాసుఁడని యున్న నాకిక |