| కీర్తనలు | తూము నరసింహదాసు | రామరామా యనవె - ఓమనసా శ్రీరామరామా యనవే |
| శంకరాభరణము - ఆట |
| పల్లవి: |
| రామరామా యనవె - ఓమనసా శ్రీరామరామా యనవే రామరామయనవె రక్షించుమనవె - కామాదులను ద్రుంచి కడతేర్చుమనవే |
| చరణము(లు): |
| అరిషడ్వర్గముల ద్రుంచి - యారింటిపై మించి యరవి శ్రీరాముల - నాశ్రయించిన జాలు |
| శరణాగతుల నెల్ల - జేకొనిప్రోచెడు వర రఘువీరుని - వర్ణింపుచును సీతా |
| పరమదయాళుడై - పన్నగశయనుడై పతితులనెల్ల జే పట్టి బ్రోచెడు సీతా |
| కరుణ గలిగి భక్త - వరదుడై భద్రాద్రి పురమున నెలకొన్న - దొరకు నేమరక |
| కరివరదుడు తూము - నరసింహదాసు నే మర కుండునట యింక - నరసి వేగమె సీతా |