| కీర్తనలు | తూము నరసింహదాసు | ఇదిగదా సుదినమునకు మూలము ఇదిగదా |
| యదుకులకాంభోజి - ఆది |
| పల్లవి: |
| ఇదిగదా సుదినమునకు మూలము ఇదిగదా |
| చరణము(లు): |
| ఇదిగదా బ్రహ్మాదుల కందని పదవి యనుచు యోగులు ధ్యానింతురు |
| యాగ యజ్ఞ తపయోగములెల్లను బాగుగఁజేయక భక్తి గొల్చుటకు |
| అరసి భక్తజనములు దినమును హృ త్సరసిజమున భవహరమని కొల్తురు |
| ప్రేమ భద్రగిరి ధాముడైన శ్రీ రాము డితడని రమియింతురు సదా |
| వాసిగ నరసింహ దాసునేలు కృపఁ డాసి కంటి మిక ధన్యుల మైతిమి |