| కీర్తనలు | తూము నరసింహదాసు | చాలదా రాములసేవ దొరికిన చాలదా - రంగనిసేవ దొరికిన జాలదా |
| యదుకులకాంభోజి - ఆట |
| పల్లవి: |
| చాలదా రాములసేవ దొరికిన చాలదా - రంగనిసేవ దొరికిన జాలదా చాలదా యికనేల నితర భూపాలకుల వేడ జాలనే సఖీ |
| చరణము(లు): |
| చాలదా మేలనుచు భవజాలమునఁ జిక్కి చాల బడల నింకేలనే సఖీ |
| ఆలుబిడ్డలను జాలితోఁబడి జాలిఁజెంద నింకేలనే సఖీ |
| యేలనింక మాటలేల నరసింహపాలకునిఁ గన జాల మేల నిది |