| కీర్తనలు | తూము నరసింహదాసు | రామా యని మిమ్ము దలచని యానోరు - రాతి రోలనవలెను |
| ఆహిరి (ధన్యాసి) - చాపు |
| పల్లవి: |
| రామా యని మిమ్ము దలచని యానోరు - రాతి రోలనవలెను ముమ్మాటికి రాతి రోలనవలెను |
| చరణము(లు): |
| బ్రతికినన్నాళ్ళు నీ భజనఁ జేయుట రామా! భవబంధమోచనము అతిదయాపరుడని యార్తరక్షకుడని - యానందపడవలెను శ్రీరామా! |
| కన్ను లున్నందుకు ఘనమైన మీమూర్తిఁ గనుగొంటి భాగ్యమున పన్నుగ భయములేకున్న రక్షకుడని యున్నదే సార్థకము శ్రీరామా |
| వాసిగ భద్రాచలేశుడవని నిన్ను నాస నెఱింగితి ని న్నాసించి నరసింహదాసుడనని నే దోసిలొగ్గివేడితి శ్రీరామా |