కీర్తనలు తూము నరసింహదాసు నీలనీరదగాత్రు నీరజదళనేత్రు నెన్నడు గనుగొందునో
నాటకురంజి - ఆట
పల్లవి:
నీలనీరదగాత్రు నీరజదళనేత్రు నెన్నడు గనుగొందునో
వాలాయముగ వనజాలములో జిక్కి మేలెరుంగక యని
మృగమునై తిరిగితి మేలిబంగరు చేలమును వజ్రాల మకుటాంగ
ములును ముత్యాల సరములు లోనుగా రత్నాల చౌకట్లమరుచుండెడు
చరణము(లు):
చుక్కలరేని నెకసక్కెములాడు చక్కని నెమ్మోముపై
చొక్కపు కస్తూరి చుక్కబొట్టుఁ దీర్చి
గ్రక్కున పదముల గజ్జెలందెలుమ్రోయ
(దు) మక్కువతొ ప్రణమిల్లుచును పెం -
పెక్కు నానందంబు మదిలోఁ
బిక్కటిలగ జన్మఫలములు
దక్కి హృత్పద్మమున నిరతము
కాంచనరత్న సంఘటిత మంటపమున మించు పీఠమునందు
పంచశరునిచేతి బాణమొయని దీ -
పించు భూమిజఁ గూడి వేంచేసె దీనులఁ
(దు) గాంచి సన్మానించి వారల
వాంఛితము లీడేర్చుటకు మో
దించి భవభయమెల్ల మొదటికి
ద్రుంచి వెఱవకు మనుచుఁ బ్రోచెడు
మీరి భద్రాద్రి విహారుఁడై భక్తమందారుఁడై రఘువీరుఁడై
కోరి కలర తూము నారసింహునియింట
భారకులై యున్న సారసనాభుని -
(దు) నీరజంబులుఁ బోలుపదముల
శ్రీరజః పటలంబుఁ గన్నులఁ
జేరిచియు ధన్యోహ మనుచును
జింత లెల్లను బాసి మదిలో
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - niilaniiradagaatru niirajadaLaneetru nennaDu ganugoMdunoo - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )