| కీర్తనలు | తూము నరసింహదాసు | నిన్ను జూచుభాగ్యము నా కన్నుల కెన్నటికో! రామ |
| శంకరాభరణము (సారంగ) - ఆది |
| పల్లవి: |
| నిన్ను జూచుభాగ్యము నా కన్నుల కెన్నటికో! రామ సన్నుతామర ప్రసన్నరాఘవ యాపన్నరక్షణ పంకజలోచన |
| చరణము(లు): |
| యెందుఁ జూచినను సుందరమగు నీచందమె మది దోచు మందహాస మునిబృందవికాస సనందనాది హృన్మందిరవాస |
| వేఱుచేసినను వేరుదిక్కికను యేరీ మహిలోన వారిజాక్ష! వరవారణరక్ష సురారిదనుజశిక్ష కటాక్ష |
| నారసింహ సత్కవిదాసావనభరణ నాగరిపు హరణా నారదాది మునిసేవిత చరణ నవరుచి శుభకర భవతరణా |