కీర్తనలు తూము నరసింహదాసు ఏమి తోచ దేమి యుపాయమె రామయ్య నా
మారువ - ఆట
పల్లవి:
ఏమి తోచ దేమి యుపాయమె రామయ్య నా
కేమి తోచ దేమి యుపాయమె
చరణము(లు):
స్వామి నిను నేను ప్రేమఁ బిలిచిన
నా మొరాలకింప వేమి రామయ్య
ఎన్నటికిని నిన్నుఁ గన్నుల జూతు
పన్నగారాతిపాలనా రామ
చారువర్ణ మేఘశ్యామ సుందరా
కార యో రఘువీరా ధీరా
భద్రగిరి రామభద్ర మునిజన
భద్రదాయక శ్రీయద్రిజాతవినుత
సూరిజనమందార చర తూము
నారసింహదాస పోషణా
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - eemi toocha deemi yupaayame raamayya naa - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )