కీర్తనలు తూము నరసింహదాసు కలడో లేడో - శ్రీరాముడు - గలడో లేడో
మధ్యమావతి - ఆట
పల్లవి:
కలడో లేడో - శ్రీరాముడు - గలడో లేడో
కలడో లేడో నన్ను గన్న శ్రీరాముడు
చరణము(లు):
తడిసి వానలకును - జడిసి వేసట నొంది
కడు వేడ్క రమ్మన్న - ఘనుఁడు రాడాయెను
ఉబ్బలిలో దారి తబ్బిబ్బును జెంది
బొబ్బపెట్టినఁగాని గొబ్బున రాడాయె
చూడు నేడు నీతోడనె యుందు న
న్నాడు నేడు వానిజాడ లేదాయెను
నిరతము భద్రాద్రిపురమున నెలకొన్న
శరణాగతత్రాణ బిరుదాంకు డగుతండ్రి
కరుణతోడుత తూము నరసింహదాసుని
అరసి రక్షించెడు నల సీతాపతి నేడు
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - kalaDoo leeDoo - shriiraamuDu - galaDoo leeDoo - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )