కీర్తనలు తూము నరసింహదాసు ఇంతనెనరు గలిగిన దైవము లిక నెవ్వరు ఓరామా
సురట - ఆది
పల్లవి:
ఇంతనెనరు గలిగిన దైవము లిక నెవ్వరు ఓరామా
వింతగదా బహువేడుకతో నా
చెంత నిలిచి భయ మంత బాపితివి
చరణము(లు):
పగలు రాత్రులును బదిలముగా నీ భక్తజనులవెంట
తగిలి యుందువని ధరలోపల మును
మిగుల వింటి నే డిదె మిముఁ గంటిని
దీనదయాళుఁడని విన్నందుకుఁ దెలిసెగదా నేడు
మానసమున నీమహిమ యెఱుంగని
మత్తుఁడ నను బహుమానించితివి
వరభద్రాచలనిలయా భవభయహరణ సదయహృదయా
పరమ దయాకర పంకజాక్ష తూము
నరసింహావన నారదాదివినుత
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - iMtanenaru galigina daivamu lika nevvaru ooraamaa - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )